సీబీఎస్‌ఈ ఫీజు 24 రెట్లు పెంపు

12 Aug, 2019 04:22 IST|Sakshi

సీబీఎస్‌ఈ పరీక్ష ఫీజు బాదుడు

10, 12వ తరగతుల ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు 24 రెట్లు పెంపు

న్యూఢిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) 10వ, 12వ తరగతుల ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పరీక్ష ఫీజును 24 రెట్లు అంటే ప్రస్తుతమున్న రూ.50 నుంచి అమాంతం రూ.1,200కు పెంచింది. అదేవిధంగా జనరల్‌ కేటగిరీ విద్యార్థుల ఫీజును రూ.750 నుంచి రూ.1,500గా నిర్ణయించింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ గత వారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే ఫీజు చెల్లింపు ప్రక్రియ మొదలు కావడంతో పాత రుసుము చెల్లించిన విద్యార్థులు పెంచిన మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. పెంచిన ప్రకారం ఫీజును గడువులోగా చెల్లించని విద్యార్థులను 2019–20 వార్షిక పరీక్షలు రాసేందుకు అనుమతించబోమని తెలిపింది.

తాజా విధానం ప్రకారం.. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల విద్యార్థులు ఐదు సబ్జెక్టులకు పరీక్ష ఫీజు రూ.1,200 చెల్లించాలి. ఇంతకు ముందు ఇది రూ.350 మాత్రమే. జనరల్‌ కేటగిరీ వారికి ఇప్పటి వరకు ఉన్న ఫీజు రూ.750ను రూ.1,500కు పెంచింది. ఈ విధానం 10, 12వ తరగతుల విద్యార్థులకు వర్తిస్తుంది. 12వ తరగతి ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులు అదనంగా ఒక సబ్జెక్టు పరీక్ష రాయాలంటే గతంలో ఎలాంటి ఫీజు ఉండేది కాదు. ఇకపై వారు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్‌ కేటగిరీ విద్యార్థులు కూడా అదనపు సబ్జెక్టు కోసం రూ.150 బదులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 100 శాతం అంధ విద్యార్థులకు మాత్రం సీబీఎస్‌ఈ పరీక్ష రుసుమును మినహాయించింది. మైగ్రేషన్‌ ఫీజును కూడా రూ.150 నుంచి రూ.350కి పెంచింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆగని వరదలు

ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తాం

కశ్మీర్‌పై ఉగ్రదాడికి కుట్ర..!

సవాళ్లను అధిగమిస్తారా?

వయనాడ్‌లో రాహుల్‌.. బాధితులకు పరామర్శ

బిల్లు చూసి ‘గుడ్లు’ తేలేసిన రచయిత..!

ఆర్టికల్‌ 370 ఎఫెక్ట్‌ : సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌కు బ్రేక్‌

ముషారఫ్‌ ఇంట్లో మికా సింగ్‌.. నెటిజన్ల ఆగ్రహం

‘చిక్కుల్లో కర్తార్‌పూర్‌ కారిడార్‌’

ప్రశాంతంగా జమ్మూకశ్మీర్‌!

ఆర్టికల్‌ 370 రద్దు.. ఉగ్రవాదం మటాష్‌!

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఆ నేరాలను అడ్డుకోలేం’

‘షేక్‌’ చేస్తోన్న శశి థరూర్‌

బీజేపీలో చేరితే చంపుతామంటున్నారు!

‘తలుపులు మూస్తేనే కదా.. ఓటింగ్‌ జరిగేది’

జొమాటోకు డెలి‘వర్రీ’

మోదీ, షా కృష్ణార్జునులు: సూపర్‌ స్టార్‌

కానిస్టేబుల్‌‌కు యావత్తు దేశం సెల్యూట్

మెట్రో రైలు కింద దూకి వ్యక్తి ఆత్మహత్య

నెహ్రు ఓ క్రిమినల్‌ : చౌహాన్‌

ఢిల్లీ నడివీధుల్లో కళ్లల్లో కారంచల్లి..

వరద విలయం

370 రద్దుపై ఎన్‌సీ సవాల్‌

సోనియా ఈజ్‌ బ్యాక్‌

ఇక కశ్మీర్‌ వధువులను తెచ్చుకోవచ్చు

ఇస్రో తదుపరి లక్ష్యం.. సూర్యుడు!

తరం మారుతున్నది.. స్వరం మారుతున్నది

సోనియా గాంధీకే మళ్లీ పార్టీ పగ్గాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త లుక్‌లో థ్రిల్‌

అనుకోని అతిథి

ఫోరెన్సిక్‌ పరీక్షల నేపథ్యంలో...

ఏడేళ్ల తర్వాత?

కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా

కో అంటే కోటి గుర్తుకొచ్చింది