ఫేస్‌బుక్‌తో జతకట్టిన సీబీఎస్‌ఈ

6 Jul, 2020 06:04 IST|Sakshi

న్యూఢిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో జత కట్టింది. విద్యార్థులకు, అధ్యాపకులకు ‘డిజిటల్‌ సేఫ్టీ, ఆన్‌లైన్‌ వెల్‌బీయింగ్, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ’ వంటి వాటిని నేర్పించడానికి ఈ భాగస్వామ్యం ఏర్పడినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ నిశాంక్‌ పోఖ్రియాల్‌ ఆదివారం వెల్లడించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.  కనీసం 10 వేల మంది ఇందులో భాగస్వాములవుతారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.   

>
మరిన్ని వార్తలు