సీబీఎస్‌ఈ పరీక్షలకు 15 వేల కేంద్రాలు

26 May, 2020 05:02 IST|Sakshi

న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలను దేశవ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ వెల్లడించారు. కోవిడ్‌–19 కారణంగా వాయిదా పడిన ఈ పరీక్షలు జూలై 1 నుంచి 15 వరకు జరగనున్నాయి. గతంలో నిర్ణయించినట్టు మూడువేల కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా సామాజిక దూరాన్ని పాటించేందుకూ, విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించే అవసరం లేకుండా ఉండేందుకూ, అత్యధిక పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్టు మంత్రి చెప్పారు. హోంశాఖ నిబంధనల ప్రకారం కోవిడ్‌–19 కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించరు. అలాగే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలను కల్పించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. 12వ తరగతి పరీక్షలు దేశవ్యాప్తంగాను,  ఈశాన్య ఢిల్లీలో  వాయిదా పడిన 10వ తరగతి పరీక్షలు ఇప్పుడు జరుగుతాయి. 

మరిన్ని వార్తలు