యూజీసీ–నెట్‌ ఫలితాల విడుదల

1 Aug, 2018 04:16 IST|Sakshi

న్యూఢిల్లీ: జూలై 8న దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ–నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) ఫలితాలను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) మంగళవారం విడుదలచేసింది. పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 11,48,235 మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకోగా అందులో 8,59,498 మంది పరీక్ష రాశారు. వీరిలో 55,872 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుతోపాటు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు 3,929 మంది అర్హత సాధించారు. ఈసారి పరీక్షల విధానంలో మార్పులు తెచ్చారు. 84 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. మూడు పేపర్ల విధానాన్ని వదిలేసి రెండు పేపర్లకు పరీక్ష చేపట్టారు. 

మరిన్ని వార్తలు