ఏపీలో ఆరుగురు అధికారులపై ఈసీ వేటు

19 Apr, 2019 15:40 IST|Sakshi

నూజివీడు, సూళ్లూరుపేట, కోవురు ఆర్వోలపై ఛార్జెస్‌ ఫ్రేమ్‌కు సీఈసీ ఆదేశాలు

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంపై చర్యలు

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు అధికారులపై తక్షణ చర్యలకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. నూజివీడు, సూళ్లూరుపేట, కోవూరు ఆర్వోలపై చార్జెస్‌ ఫ్రేమ్‌కు ఆదేశించింది. అలాగే ఏఆర్వోలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం... నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్వోలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, సస్పెండ్‌ చేసింది.

చదవండి...(మొరాయింపు కుట్రపై ఈసీ సీరియస్‌!) 

కాగా సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో ఆయన కార్యాలయ ఉన్నతాధికారులు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌చార్జీలతో పలు దఫాలు చర్చించి అనంతరం రిటర్నింగ్‌ అధికారుల జాబితాను రూపొందించారు. తమకు అనుకూలంగా ఉండే వారినే రిటర్నింగ్‌ అధికారులుగా ఎంపిక చేసి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు జాబితా పంపారని సచివాలయ వర్గాలు పేర్కొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చింది.

మరిన్ని వార్తలు