పౌరసత్వంపై ఆందోళన వద్దు!

21 Dec, 2019 04:25 IST|Sakshi

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో చట్టంలో పొందుపర్చిన పౌరసత్వం నిబంధనలపై కేంద్రం  వివరణ ఇచ్చింది. జూలై 1, 1987న లేదా ఆ లోపు భారత్‌లో జన్మించిన వారు సహజంగానే భారతీయ పౌరులవుతారని తెలిపింది. అలాగే, ఆ తేదీ(జూలై 1, 1987)లోపు వారి తల్లిదండ్రులు భారత్‌లో జన్మించినట్లైనా కానీ ఆ పిల్లలు చట్టప్రకారం భారతీయ పౌరులేనన్నారు. సీఏఏపై, ఎన్నార్సీపై వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అస్సాం విషయంలో ఈ కటాఫ్‌ 1971వ సంవత్సరంగా ఉంటుందన్నారు. ï పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం, జూలై 1, 1950 – డిసెంబర్‌ 3, 2004 మధ్య భారత్‌లో జన్మించిన వారు పౌరసత్వానికి అర్హులు. అలాగే, పిల్లలు జన్మించిన సమయంలో తల్లిదండుల్లో ఏ ఒకరైనా భారతీయ పౌరుడైతే.. ఆ పిల్లలు కూడా ఇక్కడి పౌరులవుతారు. డిసెంబర్‌ 10, 1992– డిసెంబర్‌ 3, 2004 మధ్య భారత్‌కు వెలుపల జన్మించిన వారి తల్లిదండ్రులకు భారత పౌరసత్వం ఉంటే.. ఆ పిల్లలను కూడా ఇక్కడివారిగా పరిగణిస్తారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు