కరోనా పోరు: కేంద్రం మరో కీలక నిర్ణయం

21 Jun, 2020 16:45 IST|Sakshi

కోవిడ్‌ వారియర్స్‌కు రూ.50 లక్షల బీమా

బీమా కవరేజీని సెప్టెంబర్‌ వరకు పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి అధికమౌతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ బాధితులకు సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఉద్దేశించిన రూ. 50 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను మరో మూడు నెలలు పొడిగించింది. దీంతో సెప్టెంబర్‌ వరకు కోవిడ్‌ వారియర్స్‌కు బీమా కవరేజీ ఉంటుంది. 22 లక్షల వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఈ బీమా వర్తించనుంది. కాగా, ఈ ఇన్సూరెన్స్‌ను న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ ద్వారా అందిస్తున్నారు. దేశంలో కరోనా వైరస్‌ మొదలైన గత మార్చి నుంచి ఈ బీమాను వర్తింపజేస్తున్నారు.
(చదవండి: రెండో​ దశ మానవ పరీక్షలు షురూ..)

జూన్‌ 30న ఈ బీమా గడువు ముగియనుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ దవాఖానలు, హెల్త్‌ కేర్‌ సెంటర్లు, వెల్‌నెస్‌ సెంటర్లలోని సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఆశ కార్యకర్తలు, శానిటేషన్‌ వర్కర్లకు ఈ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గతంలోనే వెల్లడించారు. కోవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రుల సిబ్బందికి కూడా ఈ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
(చదవండి: ధీటుగా బదులివ్వండి.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ!)

మరిన్ని వార్తలు