వలస కార్మికులను తరలించండి

22 Apr, 2020 14:00 IST|Sakshi

లక్నో: లాక్‌డౌన్‌తో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బహుజన​ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) నాయకురాలు మాయావతి డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కరోనా వైరస్‌  వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో ఎక్కడివారు అక్కడ ఉండిపోయారు. లక్షలాది మంది పేద వలస కార్మికులు మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. ఉపాధి కోల్పోయి తిండిలేక వలస కార్మికులు కష్టాలు పడుతున్నారు. రోజుకు ఒక్కపూట కూడా వారికి ఆహారం దొరకడం లేదు. వారంతా తమ సొంతూళ్లకు వెళ్లిపోవాలని కోరుకుంటున్నారు. కేంద్రం సానుభూతితో వలస కార్మికుల సమస్యను అర్థం చేసుకుని వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. రాజస్థాన్‌లోని కోట ప్రాంతం నుంచి విద్యార్థులను సొంతూళ్లకు తరలించినట్టుగానే ప్రత్యేక బస్సుల్లో బడుగులను తరలించాలి. లేదంటే ప్రత్యేక రైళ్లలో వలస కార్మికులను పంపించాల’ని మాయావతి ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి దేశవాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మే 3 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. 

ప్లాస్మా దానం చేయండి: తబ్లిగీ నేత

>
మరిన్ని వార్తలు