కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

29 Aug, 2018 13:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేం‍ద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలో రెండు శాతం అదనపు పెంపునకు బుధవారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. డీఏ పెంపు నిర్ణయం ఈ ఏడాది జులై 1 నుంచి వర్తింపచేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో పెన్షనర్లకు డీఏ అదనపు ఇన్‌స్టాల్‌మెంట్‌ విడుదలకూ గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మూల వేతనం లేదా పెన్షన్‌లో ప్రస్తుతం ఏడు శాతంగా ఉన్న డీఏకు అదనంగా మరో రెండు శాతాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఏ, డీఆర్‌ల పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ 6112 కోట్ల భారం పడనుంది. క్యాబినెట్‌ నిర్ణయంతో 48.41 లక్షల మంది కేం‍ద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 62.03 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు డీఏ పెంపు నిర్ణయం జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా