కోవిడ్‌-19 : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

6 Apr, 2020 16:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సోమవారం కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీల వేతనాల్లో ఏడాదిపాటు 30 శాతం కోత విధించాలని నిర్ణయించారు. రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్‌ నిధులు నిలిపివేయాలని నిర్ణయం​ తీసుకున్నారు. మరోవైపు తమ వేతనాలను తగ్గించేందుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అంగీకరించారు. వేతనాల కోత ద్వారా సమకూరిన నిధులను కన్సాలిడేషన్‌ ఫండ్‌కు జమ చేస్తారు.కాగా, కేబినెట్‌ నిర్ణయాలని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ మీడియాకు వెల్లడించారు. రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్‌ నిధులను తాత్కాలికంగా నిలిపివేస్తే రూ 7900 కోట్లు సమకూరుతాయని మంత్రి తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4067కు పెరిగింది.

చదవండి : బ‌డా నిర్మాత కూతురికి క‌రోనా

మరిన్ని వార్తలు