కేబినెట్‌లో ఆమోదం పొందినవి ఇవే!

20 May, 2020 15:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం నిర్వహించిన కేంద్రమంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేంద్రం ప్రకటించిన కొన్ని ప్యాకేజీలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆత్మ నిర్బర్ ప్యాకేజీకి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. అదేవిధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు కూడా కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. (ఘోర రోడ్డు ప్రమాదం; ఆరుగురు మృతి)

వీటితో పాటు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌లలో మార్పులు, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ ప్రైజస్‌, పీఎం వాయు వందన యోజన, ఎన్ బి ఎఫ్ సి లకు స్పెషల్ లిక్విడిటీ పథకాలు మొదలైన వాటిని కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. మూడు లక్షల కోట్ల ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌లు, బొగ్గు గనుల వేలానికి సంబంధించి నూతన విధానానికి కూడా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ మాఫీకి కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. (డబ్ల్యూహెచ్ఓలో కేంద్ర మంత్రికి కీలక పదవి)

మరిన్ని వార్తలు