ఇవి స్వదేశి ఉత్పత్తులు: హోంమంత్రిత్వ శాఖ

1 Jun, 2020 20:03 IST|Sakshi

సాక్షి, న్యూడిల్లీ: ‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పారామిలిటరీ క్యాంటీన్లలో దిగుమతి అయిన 1,000పైగా ఉత్పత్తులను నిషేధించాలన్న ఉత్తర్వులను కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉపసంహరించుకుంది. దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల్లో అనేక వస్తువులు భారత్‌లోనే తయారైనట్లు వెల్లవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పారామిలిటరీ క్యాంటీన్‌లు దేశీయ పరిశ్రమలకు మద్దతునిచ్చే క్రమంలో జూన్ 1వ తేదీ నుంచి స్వదేశీ లేదా భారతీయ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తామని ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. (‘కరోనా వ్యాప్తిలో భారత్‌ అగ్రస్థానానికి వెళ్తుంది’)

ఇటీవల క్యాంటీన్లలో దిగుమతి అయిన ఉత్పత్తులను పరిశీలించగా అందులో నిషేధించబడిన ‘నుట్రెల్లా, కిండర్ జాయ్, టిక్ టాక్, హార్లిక్స్, ఓట్స్, యురేకా ఫోర్బ్స్, టామీ హిల్‌ఫిగర్ షర్ట్స్‌, అడిడాస్ బాడీ స్ప్రే’లు వంటి బ్రాండ్‌లు ఉన్నట్లు గమనించారు. మైక్రోవేవ్ ఓవెన్లు వంటి ఇతర గృహోపకరణాల వస్తువులను కూడా తీసివేసింది. అంతేగాక స్కెచర్స్, ఫెర్రెరో, రెడ్‌బుల్, విక్టోరినాక్స్, సఫిలో (పోలరాయిడ్, కారెరా) సహా దిగుమతి చేసుకునే ఏడు సంస్థల ఉత్పత్తులను కూడా నిషేధ జాబితా నుంచి తొలగించింది. ఈ జాబితాలో ఉన్న భారత ఉత్పత్తులైన డాబర్, బజాజ్, ఉషాతో సహా అనేక భారతీయ ఉత్పత్తులను కూడా ఈ జాబితా నుంచి తొలగించినట్లు హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

హోంమంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి స్పందిస్తూ.. ‘‘మా అధికారి మంత్రిత్వ శాఖను సంప్రదించకుండానే దిగుమతి ఉత్పత్తులను తీసుకున్నారు. ఇండియా ఉత్పత్తులను కూడా నిషేధ బ్రాండ్‌లలో చేర్చిన సదరు సీనియర్‌ అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటాం. అంతేగాక పూర్వ జాబితాను పరిశీలించి దానిని సవరించాం. త్వరలో సవరించిన జాబితాను పంపిస్తాం’’ అని చెప్పారు.  ఈ క్యాంటీన్ల మాతృసంస్థ కేంద్రీయ పోలీసు కళ్యాణ్ భండార్స్ అన్ని ఉత్పత్తులను మూడు వర్గాలుగా విభజించారు. కేటగిరి1- భారతదేశంలో పూర్తిగా తయారైన ఉత్పత్తులను కలిగి ఉంది. కేటగిరీ 2- దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలతో ఉత్పత్తులు ఉన్నాయి, కానీ అవి భారతదేశంలో తయారు చేయబడతాయి లేదా సమావేశమవుతాయి. కేటగిరి 3 - పూర్తిగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులు మాత్రమే ఉంటాయి. 

మరిన్ని వార్తలు