ఎల్‌టీసీతో ఇక విదేశీ పర్యటన

30 Jul, 2018 01:58 IST|Sakshi

కేంద్ర ఉద్యోగులకు వెసులుబాటు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌(ఎల్‌టీసీ) సదుపాయాన్ని ఇకపై విదేశీ పర్యటనలకు కూడా వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సిబ్బంది, శిక్షణా మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. దీనిపై అభిప్రాయం తెలపాలని హోం, పర్యాటక, పౌర విమానయాన తదితర మంత్రిత్వ శాఖలను కోరింది. విదేశాంగ శాఖ రూపొందించిన ఈ ప్రణాళికలో భాగంగా కజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉబ్జెకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్‌ దేశాల్లో పర్యటించే ఉద్యోగులు ఎల్‌టీసీ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వ్యూహాత్మకంగా కీలకమైన  తూర్పు ఆసియాలో భారత పర్యాటకుల సంఖ్యను పెంచే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎల్‌టీసీ కింద సెలవు ఇవ్వడంతో పాటు విమాన ప్రయాణ చార్జీలను ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుంది. సార్క్‌ దేశాల్లో పర్యటించే ఉద్యోగులకు ఎల్‌టీసీని వర్తింపజేసే ప్రతిపాదనను కేంద్రం మార్చిలో వాయిదావేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు