నీటి పంచాయతీపై చలో ఢిల్లీ!

8 Mar, 2019 04:00 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై కేంద్రం నజర్‌

13న కృష్ణా, గోదావరి బోర్డులతో కేంద్రం సమావేశం

సాక్షి, హైదరాబాద్‌ : కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై మరోమారు చర్చలకు కేంద్రం సిద్ధమైంది. ఏడాది కిందట ఈ బోర్డులతో చర్చించిన పిదప మరెలాంటి చర్చలు చేయని కేంద్రం, తొలి సారి రెండు నదీ యాజమాన్య బోర్డుల చైర్మన్‌లు, కార్యదర్శులతో సమావేశం జరిపేందుకు సమాయత్త మైంది. ఈ నెల 13న ఢిల్లీలో బోర్డులతో భేటీ నిర్వ హిస్తామని కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లకు కేంద్ర జల వనరుల శాఖ లేఖలు రాసింది. కృష్ణా, గోదావరి నదీ జలాల పరిధిలో నెలకొన్న వివాదా లతో పాటు, పోలవరం పరిధిలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న అంశాలపై అన్న నివేదికలతో రావాలని కేంద్రం బోర్డుల చైర్మన్లను ఆదేశించింది.

బోర్డు పరిధి, కొత్త ప్రాజెక్టులు
కృష్ణా, గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఐదేళ్లుగా అనేక వివాదాలు నడుస్తున్నాయి.  కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల నియంత్రణ, నీటి కేటాయింపుల్లో వాటాలు, కొత్త ప్రాజెక్టులపై వివాదం కొనసాగు తోంది. తెలంగాణ ఇటీవలే వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం వంటి ఎత్తిపోతల పథకాలు చేప ట్టిందని ఏపీ బోర్డులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటే బోర్డుల పరిధి, వర్కిం గ్‌ మ్యాన్యువల్‌ను ఆమోదిం చాల్సి ఉంది. దీనిపై తెలంగాణ అనేక అభ్యంతరాలు చెబుతోంది. కృష్ణాలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటా యింపులే లేనప్పుడు, ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం ఎందుకని తెలంగాణ ప్రశ్నిస్తోంది. నిర్ణీత కేటా యింపుల్లోంచే వాటా నీటిని వాడుకుంటు న్నామని చెబుతోంది. దీంతో బోర్డు మ్యాన్యు వల్‌కు ఆమోదం దక్కడం లేదు. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటే ఇంతవరకు జరగలేదు. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలపై చర్చిద్దామని కేంద్రం బోర్డులకు స్పష్టం చేసింది.

మళ్లింపు వాటా, ముంపు తీవ్రత ప్రధానం..
బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం ఏపీ చేపట్టిన పోలవరం ద్వారా తెలంగాణకు 45 టీఎంసీలు, ఇదే అవార్డు ప్రకారం పోలవరం కాకుండా ఇంకా ఏదైనా ప్రాజెక్టు (పట్టిసీమ) ద్వారా గోదావరి నుంచి కృష్ణా కు నీటిని తరలిస్తే అంతే పరిమాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతూ మొత్తంగా 90 టీఎంసీ లు తమకు దక్కుతాయని తెలంగాణ అంటోంది. ఈ నీటిని కృష్ణాలో ప్రస్తుతం ఉన్న 299 టీఎంసీల వాటాకు జోడించాలని కోరుతోంది. దీనిపై బోర్డుల వద్ద చర్చ జరిగినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ వాటాలకోసం ఇటీవల తెలంగాణ.. బోర్డుపై ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో  కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్‌ సింగ్‌ అధ్యక్షతన 13న ఢిల్లీలోని శ్రమశక్తిభవన్‌లో రెండు బోర్డుల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తలు