ఎస్‌ఎస్‌సీ స్కాంపై సీబీఐ విచారణ

5 Mar, 2018 13:18 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల కోసం స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) పరీక్షల కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీబీఐ విచారణకు ఆదేశించింది. పలువురు అభ్యర్ధులు విజ్ఞప్తి మేరకు సీబీఐ విచారణను ఆదేశించామని, ఇక నిరసనలు ఆపాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సూచించారు. కాగా  సుమారు 9,372 ఖాళీల భర్తీ కోసం ఫిబ్రవరిలో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రం ముందుగానే లీకైందని అభ్యర్ధులు ఆరోపిస్తూ ఆందోళనలు, నిరసనలు చేసిన విషయం తెలిసిందే.  పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరగడంతో పాటు, సమాధానాలతో సహా ప్రశ్నాపత్రాలు సోషల్‌ మీడియాలో షేర్‌ అవడంతో ఫిబ్రవరి 21న జరిగిన పరీక్షను ఎస్‌ఎస్‌సి రద్దు చేసింది. ఈ స్కాంపై సీబీఐతో  విచారణ జరపాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు