కరోనా: సగం కంటే ఎక్కువ కోలుకున్నారు

14 Jun, 2020 17:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసలు సంఖ్య పెరుగుతోంది. కేసుల పెరుగుదలతో పాటు వైరస్‌ సోకి చికిత్స అనంతరం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యేవారి శాతం కూడా పెరుగుతోంది. తాజాగా ఆదివారం కరోనా వైరస్‌ రికవరీ రేటు 50 శాతం దాటిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 11,929 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 50.60 శాతం మంది కోలుకున్నారని పేర్కొంది. దీంతో దేశంలో వైరస్‌ సోకిన వారిలో సగం కంటే ఎక్కువ మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. (సంప్రదింపులతో సరిహద్దు సమస్యకు పరిష్కారం)

గత రెండు రోజులుగా.. రోజుకు 11 వేల చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనప్పటికీ రికవరీ రేటు కూడా అదే స్థాయిలో రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,49,348 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,62,378 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక 9,195 మంది కరోనా వైరస్‌ బారినపడి మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. (‘కరోనా దేవి’కి కేరళలో నిత్య పూజలు)

ఇక శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం హోం మంత్రి అమిత్‌ షా కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలను బలోపేతం చేస్తామని తెలిపారు. ఢిల్లీలో కరోనా నిర్ధారణ పరీక్షలు అధిక సంఖ్యలో పెంచుతామని పేర్కొన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఆరోగ్య మౌలిక సదుపాయలను కల్పిస్తామని, ఆస్పత్రుల్లో బెడ్ల కొరతను నివారించాడానికి 500 రైల్వే కోచ్‌లను కరోనా బాధితులకు కేటాయిస్తామన్న విషయం తెలిసిందే. (‘ప్రేమ పేరుతో రూ.16 లక్షలు మోసం’)

>
మరిన్ని వార్తలు