చైనాకు వెళ్లకండి.. 

18 Jan, 2020 03:50 IST|Sakshi

భారత పర్యాటకులకు కేంద్రం హెచ్చరిక

చైనాలో ప్రమాదకర వైరస్‌ వ్యాప్తి

ఢిల్లీ: చైనాలో ప్రమాదకర ‘నావల్‌ కరొనా’ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో చైనా వెళ్లే భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాక చైనా నుంచి తిరిగివస్తున్న యాత్రికులను కేంద్ర ఆరోగ్య శాఖ థర్మల్‌ స్కానర్లతో పరీక్షిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల విమానాశ్రయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

చైనాలో ఈ వైరస్‌ 41 మందికి సోకగా, ఒకరు మృతి చెందారని ఆదేశం ఈ నెల 11న ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ లేనప్పటికీ చైనాలో ఒకరి నుంచి ఒకరికి దగ్గు, తుమ్ముల ద్వారా కూడా ఈ వ్యాధి సోకుతోందని గుర్తించారు. దీంతో అలర్ట్‌ అయిన కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)తో కలసి నియంత్రణ కోసం కృషి చేస్తోందని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రీతి సుడాన్‌ చెప్పారు.

ఇవీ జాగ్రత్తలు.. 
ఈ వైరస్‌ గురించి ఎక్కువగా తెలియకపోయినప్పటికీ కొన్ని జాగ్రత్తలను కేంద్రం సూచిస్తోంది. పొలాలకు, జంతుశాలలకు, జంతువధ స్థానాలకు వెళ్లవద్దని తెలిపింది. మాంసానికి దూరంగా ఉండాలని, ఒకవేళ తినాల్సి వస్తే బాగా ఉడికించిన మాంసాన్ని తీసుకోవాల్సిందిగా సూచించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేటి ముఖ్యాంశాలు..

ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు 

కశ్మీర్‌పై అనుమానాలేం లేవు

బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా! 

జీశాట్‌–30 ప్రయోగం సక్సెస్‌ 

సినిమా

చిట్టి చిలకమ్మ

ఆ నలుగురూ నాకు స్ఫూర్తి

వెండి తెరపై మండే భాస్వరం

కోల్‌కతాలో కోబ్రా

నా బలం తెలిసింది

కష్టాన్నంతా మరచిపోయాం – తమన్‌

-->