'నీట్'పై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్రం

10 May, 2016 11:14 IST|Sakshi

న్యూఢిల్లీ : నీట్ పరీక్షపై కేంద్ర ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విద్యార్థులు ఏడు ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో మంగళవారం కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటి వరకు ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసేందుకు విద్యార్థులు అలవాటు పడ్డారని సుప్రీంకు కేంద్రం తెలిపింది. అలాగే నెగటివ్ మార్క్ విధానం కూడా ఇప్పటి వరకు రాష్ట్రాల పరీక్ష విధానంలో లేదని ఆ పిటిషన్లో స్పష్టం చేసింది. కేంద్రం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, అస్సామీ, బెంగాలీ, ఉర్ధూ భాషలో నీట్ పరీక్ష నిర్వహించాలని సుప్రీంను కేంద్రం కోరింది. 

 

మరిన్ని వార్తలు