మెట్రో నగరాల్లో జోన్లను బట్టి సడలింపులు: కేంద్రం

2 May, 2020 15:46 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తున్నందున లాక్‌డౌన్‌ను మే 17 వరకు పోడగించాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గిన ప్రాంతాలను వివిధ జోన్లుగా కేటాయించి ఆయా ప్రాంతాల్లో అవసరమైన సడలింపులను ఇచ్చింది. ఈ క్రమంలో మెట్రో నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతాలలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌ ప్రాంతాలకు కేంద్రం కొన్ని సడలింపు ఇస్తూ మార్గదర్శకాలను వెల్లడించింది.
(మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ)

నగరంలో అవసరమైన కార్యకలాపాల కోసం ప్రయణాలు చేయొచ్చా..
దేశ వ్యాప్తంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ అవసరమైన కార్యకలాపాల ప్రయణాలపై కేంద్రం దేశవ్యాప్తంగా నిషేధం విధించినట్లు శుక్రవారం పేర్కొంది. ఇక అటువంటి ప్రయాణాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఉన్నట్లు పేర్కొంది. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయా ప్రాంతాలకు నిర్థిష్ట​ పరిమితులు విధించడానికి రాష్ట్రా ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అధికారం ఉన్నట్లు కూడా కేంద్రం వెల్లడించింది. 

ఇక ఉదయం, సాయంత్రం వాకింగ్‌కి అనుమతి?
సాంకేతికపరంగా అనుమతి ఉన్నప్పటికీ అది ఆయా రాష్ట్ర, నగరాల నిర్దిష్ట మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది.

ఇంటి పనులకు పనిమనిషి రావడానికి అనుమతి ఉందా? 
సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య అనవసరమైన ప్రయాణాన్ని నిషేధించినప్పటికీ.. రోజులో పగటిపూట గృహ సహాయాలకు, పని మనుషులకు అనుమతి ఉన్నట్లు పేర్కొంది.

స్నేహితుల దగ్గరకు వెళ్లేందుకు అనుమతి? 
అనవసర కార్యకలాపాలకు నిషేధం విధించిన సమయంలో స్నేహితులు లేదా సన్నిహితులను కలుసుకునేందుకు నిషేధం ఉంది. నిషేధం సమయంలో కాకుండా మిగతా సమయాల్లో స్నేహితులను, బంధువులను కలుసుకోవచ్చు. అయితే అది వారున్న ప్రాంతాల్లోని నిర్థిష్ట మార్గదర్శకాలను బట్టి ఉంటుంది. అయితే కేంద్రం సామాజిక, మతపరమైన సమావేశాలపై నిషేధం విధించింది.
చదవండి: ప్రధానీ కీలక భేటీ: రెండో ప్యాకేజీ సిద్దం!

ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉందా?
రెడ్ జోన్ల ప్రాంతాలలో ప్రభుత్వం వాహనాలతో అనుమతించబడిన కార్యకలాపాలకు అనుమతిస్తుందని కేంద్రం వెల్లడించింది. అయితే డ్రైవర్‌తో పాటు కేవలం ఇద్దరు ప్రయాణీకులతో మాత్రమే అనుమతి ఉంది. కానీ ద్విచక్ర వాహనాలకు పిలియన్-రైడింగ్ అనుమతించబడవు.

ప్రజా రవాణా సంగతేంటి?
రెడ్‌జోన్‌ ప్రాంతాల నివాసితులకు కనీసం సైకిల్ రిక్షాలు, ఆటో-రిక్షాలకు కూడా అనుమతించబడవు. ఇక దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లను నిషేధించబడ్డాయి. ఇక ఆరెంజ్ జోన్లలో ఇంటర్ ఇంట్రా-డిస్ట్రిక్ట్ బస్సు కార్యకలాపాలు నిషేధించబడ్డాయి, కాని డ్రైవర్‌తో పాటు కేవలం ఇద్దరు ప్రయాణీకులతో ప్రైవేట్ వాహనాల్లో కదలికను అనుమతిస్తారు. కాగా గ్రీన్ జోన్‌లలో మాత్రం బస్సులో 50 శాతం ప్రయాణాకులతో నడపడానికి అనుమతినిచ్చింది. 

తెరిచే దుకాణాలు ఏవేవి?
నగర పరిధిలో ఉన్న అన్ని మాల్స్‌, మార్కెట్ కాంప్లెక్స్‌ మూసివేయబడతాయి. కానీ నిత్యవసర వస్తువులు అమ్మే కిరాణా దుకాణాలకు మినహాయింపు ఉంటుంది. అన్ని స్వతంత్ర దుకాణాలు, పొరుగు దుకాణాలు, నివాస సముదాయాలలో ఉన్న దుకాణాలకు అవసరమైనవా లేదా అనే దానితో సంబంధం లేకుండా అనుమతించబడతాయి, అయితే భౌతిక దూరం మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ షాపింగ్ గురించి ఏమిటి?
అవసరమైన వాటి కోసం మాత్రమే రెడ్ జోన్లలో ఇ-కామర్స్ అనుమతించబడిందని ​కేంద్రం ఉత్తర్వులలో పేర్కొంది. ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో అనవసరమైన (ఆన్‌లైన్ షాపింగ్స్‌) విక్రయాలకు కూడా అనుమతి ఉంటుందని పెర్కొంది.

ఆరోగ్య సేతు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి కాదా?
ప్రైవేటు, ప్రభుత్వ రంగాల ఉద్యోగులు ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఆప్‌ను ప్రతీ ఉద్యోగి ఉపయోగించేలా చూడటం సదరు సంస్థ నిర్వాహకుడి బాధ్యత. రెడ్‌, ఆరెంజ్‌ జోన్ల వారు మాత్రమే కాకుండా సడలింపులు లేని అని కంటైన్‌మెంట్‌ జోన్‌లకు కూడా ఆరోగ్య సేతు తప్పనిసరి అని కేంద్రం పేర్కొంది. 

రెడ్ జోన్స్: వీటిని హాట్ స్పాట్స్ అని కూడా పిలుస్తారు. కరోనా వైరస్‌(కోవిడ్ -19) కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలు. ఒక ప్రాంతాన్ని రెడ్‌జోన్‌ ప్రకటించే ముందు, మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య, రెట్టింపు రేటును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రస్తుతం భారతదేశంలో 130 రెడ్‌జోన్‌లు ఉన్నాయి.

ఆరెంజ్ జోన్లు: రెడ్‌, గ్రీన్‌ లేని ప్రదేశాలు. తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలు. ప్రస్తుతం ఈ విభాగంలో 284 జిల్లాలు ఉన్నాయి.

గ్రీన్ జోన్స్: కేసులు లేని ప్రదేశాలు, 21 రోజుల్లో కేసు నమోదు కాని ప్రదేశాలు. ప్రస్తుతం దేశంలో 319 గ్రీన్‌ జోన్‌లు ఉన్నాయి.

మరిన్ని వార్తలు