గోప్యత పేరుతో అడ్డుకోవద్దు

17 Oct, 2018 01:14 IST|Sakshi
మంగళవారం ఢిల్లీలో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీధర్, తదితరులు

సమాచార నిరాకరణపై కేంద్ర సమాచార కమిషనర్‌ శ్రీధర్‌

సాక్షి, న్యూఢిల్లీ: గోప్యత పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వకుండా తిరస్కరించేందుకు వీల్లేదని కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు స్పష్టం చేశారు. శ్రీధర్‌ ఆచార్యులు రచించిన ‘ప్రైవసీ యాజ్‌ సీక్రసీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం ఢిల్లీలోని సమాచార కమిషన్‌ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ప్రొఫెసర్‌ ఉపేంద్ర బక్షీ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం శ్రీధర్‌ ఆచార్యులు మాట్లాడుతూ.. ‘సమాచార హక్కును గోప్యత పేరుతో అడ్డుకోరాదు. గోప్యత హక్కును దుర్వినియోగం చేసి సమాచారాన్ని నిరాకరించరాదు. ఇదే విషయాన్ని ఈ పుస్తకంలో వివరించా. గోప్యత పేరుతో ప్రజలకు ఇవ్వాల్సిన సమాచారాన్ని నిరాకరించే ఆఫీస్‌ మెమోరాండంను ప్రభుత్వాలు వెనక్కు తీసుకోవాలి. అడిగిన వివరాలు వెల్లడించాల్సిందే అనే విషయాన్ని స్పష్టంగా చెబుతూ డీవోపీటీగానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ మరో ఆఫీస్‌ మెమోరాండంను విడుదల చేయాలి. అప్పుడే గోప్యత హక్కు దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది’ అని అన్నారు.

మరిన్ని వార్తలు