రాష్ట్రాలు దానిపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి

28 Apr, 2020 19:17 IST|Sakshi

సాక్షి,ఢిల్లీ: నిత్యావసర సరుకుల లారీలు, ట్రక్కులకు అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ అన్నారు. మంగళవారం గడ్కరీ రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలు చేశారు. సాధారణ జన జీవితం ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్ల నిర్మాణానికి భూసేకరణ త్వరితగతిన పూర్తి చేసి, 25 వేల కోట్ల రూపాయల నిధులను సద్వినియోగం చేసుకోవాలని గడ్కరీ కోరారు. ఆర్ధిక వ్యవస్థను వేగవంతం చేయడానికి రవాణా వ్యవస్థ  వెన్నెముక లాంటిదని, రాష్ట్రాలు దీనిపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారుల నిర్మాణాలను మూడు రెట్లు వేగవంతం చేయాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో యాప్ ఆధారంగా నడిపే టూవీలర్ టాక్సీలను తీసుకురావాలి గడ్కరీ కోరారు. 

మరిన్ని వార్తలు