కేంద్ర పథకాల కుదింపునకు ఓకే

4 Aug, 2016 10:42 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రాయోజిత పథకాలు (సీఎస్‌ఎస్) 30కి మించకుండా కుదించాలంటూ ముఖ్యమంత్రుల కమిటీ చేసిన కీలక సిఫార్సును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అలాగే ఈ పథకాల ఫ్లెక్సీ నిధులను 10 శాతం నుంచి 25 శాతానికి పెంచాలన్న సూచనకూ పచ్చజెండా ఊపింది.

దీంతో నిధులను వెచ్చించడంలో నిర్ధిష్ట లక్ష్యాన్ని అందుకోవడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ లభిస్తుంది. కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రం ఫ్లెక్సీ నిధులను 30 శాతానికి పెంచారు. సీఎంల కమిటీ మొత్తం 66 కేంద్ర పథకాలను సమీక్షించింది.

>
మరిన్ని వార్తలు