ఐఏఎస్ అధికారిణి సస్పెన్షన్ పై నివేదిక కోరాం

31 Jul, 2013 23:33 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇసుక మాఫియాపై చర్యలు తీసుకున్న మహిళా ఐఏఎస్ అధికారిని దుర్గాశక్తి నాగపాల్‌ సస్పెన్షన్‌కు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్నినివేదిక కోరామని కేంద్ర మంత్రి నారాయణస్వామి తెలిపారు. మహిళా ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయడంపై ఉత్తరప్రదేశ్‌లోని సాటి ఐఏఎస్ అధికారుల్లో కలకలం రేగింది. ఇప్పటికే అఖిలేష్ యాదవ్ సర్కారుపై ఒత్తిడి పెంచిన ఐఏఎస్ అధికారుల సంఘం మంత్రి నారాయణస్వామిని కలవాలని భావిస్తున్న తరుణంలో ఆయన స్పందించారు. ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ సర్కారును తమకు ఎటువంటి నివేదిక అందలేదని ఆయన తెలిపారు.
 
ఐఏఎస్ అధికారుల సంఘ తనను కలవడానికి ప్రయత్నిస్తోందని, తాను గురువారం వారితో సమావేశమవుతానన్నారు. తమ వాదనను తప్పకుండా వింటానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చట్ట పరమైన ఉల్లంఘనలకు పాల్పడితే కేంద్రం జోక్యం చేసుకుంటుందన్నారు.
 
 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ యూపీలోని గౌతమబుద్ధనగర్ సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. ఇసుక మాఫియాపై చర్యల్లో భాగంగా ఒక మసీదు గోడ కూలగొట్టాలంటూ ఆమె ఆదేశాలు జారీ చేశారు. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా ఈ ఆదేశాలు జారీ చేసినందుకు ప్రభుత్వం ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ చర్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఐఏఎస్ అధికారుల సంఘం దుర్గాశక్తి నాగపాల్‌కు బాసటగా నిలి చింది. ఐఏఎస్‌ల సంఘం ప్రతినిధులు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి, ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు