జేకేఎల్‌ఎఫ్‌ను నిషేధించిన కేంద్రం

22 Mar, 2019 19:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో యాసిన్‌ మాలిక్‌ నేతృత్వంలోని వేర్పాటువాద సంస్థ జమ్మూ కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్‌ఎఫ్‌)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రేరేపించడంలో జేకెఎల్‌ఎఫ్‌ ప్రమేయంతో ఆ సంస్థను కేంద్రం నిషేధించినట్టు కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా వెల్లడించారు.

యాసిన్‌ మాలిక్‌ నేతృత్వంలోని జేకేఎల్‌ఎఫ్‌ 1988 నుంచి కశ్మీర్‌లో వేర్పాటువాద సిద్ధాంతాన్ని వ్యాపింపచేస్తోందని చెప్పారు.  ఉగ్రవాద నిరోధక చట్టం కింద జేకేఎల్‌ఎఫ్‌పై కేంద్రం వేటువేసింది. కాగా  జేకేఎల్‌ఎఫ్‌, జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల నిషేధానికి గురైన రెండవ సంస్థ కావడం గమనార్హం. మరోవైపు ఇదే నెలలో కేంద్రం జమాతే ఇస్లామి జమ్ము కశ్మీర్‌ సంస్థనూ నిషేధించింది.

కాగా యాసిన్‌ మాలిక్‌ నేతృత్వంలోని జేకేఎల్‌ఎఫ్‌పై కేంద్రం నిషేధాన్నిపీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. యాసిన్‌ మాలిక్‌ హింసను విడనాడి సమస్య పరిష్కార ప్రక్రియలో భాగస్వామిగా ఉన్నాడని, వాజ్‌పేయి ప్రారంభించిన సంప్రదింపుల ప్రక్రియలోనూ పాల్గొన్నాడని చెప్పారు. ఈ సంస్థపై నిషేధం విధించడం ద్వారా ఏం సాధించదలుచుకున్నారని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు కశ్మీర్‌ను బహిరంగ కారాగారంగా మారుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాలి

‘అదృష్టం.. ఈ రోజు ముందు సీట్లో కూర్చోలేదు’

మట్టికుప్పల కింద మనిషి.. బతికాడా..!

క్రికెట్‌లో గొడవ.. కత్తెరతో పొడిచి హత్య

మూకదాడులు ఎలా చేయాలో నేర్పిస్తారేమో!

ఆరోగ్య మంత్రి మాటలు అమలయ్యేనా?

ఈ రాఖీలు వేటితో చేశారో చెప్పగలరా?

మోదీని అనుకరించారు.. అడ్డంగా బుక్కయ్యారు

‘ఉన్నావో రేప్‌’ ఎటుపోతుంది?

తలాక్‌ చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం

మరో రెండ్రోజులు భారీ వర్షాలు

సిద్ధార్థ అంత్యక్రియలకు ఎస్‌ఎం కృష్ణ

కర్ణాటక నూతన స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే

ఆ లేఖ ఆలస్యంగా అందింది: సీజేఐ

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’

దేశ చరిత్రలో తొలిసారి.. సిట్టింగ్‌ జడ్జ్‌పై

ఆగస్టు 6, 7 తేదీల్లో సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

చత్తీస్‌గఢ్‌లో పేలుడు : జవాన్‌ మృతి

మిస్టరీగానే జయలలిత మరణం

స్పీడ్‌ పెరిగిన...  హీరో మోటార్స్‌ 

స్పీకర్‌ అధికారం మాకెందుకు?

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

సిద్ధార్థ మృతదేహం లభ్యం

ట్రిపుల్‌ తలాక్‌ ఇక రద్దు

మెట్రోలో సరసాలు: వీడియో పోర్న్‌ సైట్‌లో

రాజకీయాల్లోకి వచ్చి పెద్ద తప్పుచేశా.. మళ్లీ రాను

గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌.. గుర్తు పట్టారా..!

ఈనాటి ముఖ్యాంశాలు

చారిత్రాత్మక విజయం: ప్రధాని మోదీ

లీకైన సన్నీ లియోన్‌ ఫోన్‌ నంబర్‌..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!

సైమాకు అతిథులుగా..!

‘సైరా’ సందడే లేదు?

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’