మమతకు కేంద్రం ఝలక్‌

12 Dec, 2016 15:11 IST|Sakshi
మమతకు కేంద్రం ఝలక్‌

కోల్‌ కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నరేంద్ర మోదీ సర్కారు ఝలక్‌ ఇచ్చింది. ఆమెకు తెలియకుండానే బెంగాల్ లోని జాతీయ రహదారిపై రెండు టోల్‌ గేట్లు వద్ద కేంద్రం సైనిక బలగాలను దించింది. దీనిపై మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర బలగాలను ఎప్పుడూ మొహరించలేదని అన్నారు. ఇది చాలా సున్నితమైన విషయమని పేర్కొన్నారు. తాను ఆన్ ది రికార్డుగా మాట్లాడుతున్నానని, తన మాటలను కేంద్రం విస్మరించదని భావిస్తున్నట్టు మమతా చెప్పారు.

శుక్రవారం అర్థరాత్రి నుంచి టోల్‌ ట్యాక్స్‌ తిరిగి వసూలు చేయనున్న నేపథ్యంలో ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్రం బలగాలు మొహరించింది. పాత పెద్ద నోట్లను ముందునుంచి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విన్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్‌ లో టోల్‌ గేట్ల వద్ద కేంద్ర బలగాలను దించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు