ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌

12 Sep, 2017 18:06 IST|Sakshi
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌
సాక్షి, న్యూఢిల్లీ : 50 లక్షల మంది ఉద్యోగులకు, 61 లక్షల మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. డియర్‌నెస్‌ అలవెన్స్‌ను, డియర్‌నెస్‌ రిలీఫ్‌ను 1 శాతం పెంచి 5 శాతం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బేసిక్‌ వేతనం, పెన్షన్‌ కింద ప్రస్తుతం ఇస్తున్న 4 శాతం డీఏ రేటును, 1 శాతం పెంచుతున్నట్టు అధికారిక ప్రకటన వెలువరించింది. ఈ కొత్త రేటు జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని కేబినెట్‌ పేర్కొంది.  
 
డీఏ, డీఆర్‌ రెండింటి ఖాతాల ద్వారా ఖజానాపై పడే ప్రభావం వార్షికంగా రూ.3,068.26 కోట్లు ఉంటుందని, అదే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలల కాలానికి( 2017 జూలై నుంచి 2018 ఫిబ్రవరి) రూ.2,045.50 కోట్లుగా ఉంటుందని తెలిసింది. కేంద్ర కేబినెట్‌ మంగళవారం తీసుకున్న నిర్ణయంతో 49.26 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. 
మరిన్ని వార్తలు