ఇక రైల్వే చార్జీల బాదుడు

20 Jun, 2014 02:35 IST|Sakshi
ఇక రైల్వే చార్జీల బాదుడు

న్యూఢిల్లీ: సంస్కరణల పేరుతో మోడీ సర్కార్ ప్రజలపై వడ్డనకు సిద్ధమవుతోంది. రైలు చార్జీలను పెంచడానికి కసరత్తు మొదలుపెట్టింది. చార్జీల పెంపుతో పాటు రైల్వేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) పచ్చజెండా ఊపాలని భావిస్తోంది. చార్జీల పెంపు, ఎఫ్‌డీఐలపై రెండు మూడు రోజుల్లో ఓ నిర్ణయానికి రానున్నట్టు రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ తెలిపారు. ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం, సరుకు రవాణాపై 6.5 శాతం మేర చార్జీలు పెంచాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను రెండు రోజుల్లో సదానందగౌడ ప్రధాని మోడీ ముందుంచనున్నారు. జూలై రెండో వారంలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే వీటిపై ఓ నిర్ణయానికి రానున్నారు. రైల్వే అభివృద్ధి కోసమే ఎఫ్‌డీఐలకు అనుమతివ్వాలని భావిస్తున్నట్టు సదానందగౌడ తెలిపారు.ఎఫ్‌డీఐల వల్ల  హైస్పీడ్ రైళ్లు, రైల్వే స్టేషన్లు అభివ ృద్ధి చెందుతాయన్నారు.

మరిన్ని వార్తలు