సోషల్‌ మీడియాలో విశృంఖలత్వానికి చెక్‌..

22 Oct, 2019 13:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో విపరీత ధోరణులకు అడ్డుకట్ట వేసేలా సామాజిక మాధ్యమాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సోషల్‌ మీడియా వేదికల్లో విద్వేష ప్రసంగాలు, నకిలీ వార్తలు, ప్రతిష్టను దిగజార్చే పోస్టులు, జాతివ్యతిరేక​ కార్యకలాపాలను నియంత్రించేలా వచ్చే ఏడాది జనవరి 15 నాటికి నూతన నిబంధనలు ఖరారు చేయనున్నారు. సోషల్‌ మీడియా నియంత్రణకు సంబంధించి కీలక విధివిధానాలను వచ్చే ఏడాది జనవరి 15 నాటికి సిద్ధం చేస్తామని సర్వోన్నత న్యాయస్ధానానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాథ్యమాల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు, అభ్యంతరకర పోస్టులను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు నోటీసులకు స్పందనగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు పేర్కొంది.

మరిన్ని వార్తలు