ఐఏఎస్‌లపై రాష్ట్రాల అధికారంలో మార్పునకు నో!

11 Sep, 2013 03:10 IST|Sakshi

సస్పెన్షన్ అధికారం ఉపసంహరణకు కేంద్రం విముఖత
 న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసు అధికారులను సస్పెండ్ చేసే అధికారాన్ని రాష్ట్రాల నుంచి వెనక్కి తీసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. అయితే రాష్ట్రాలు క్రమశిక్షణ చర్యల పేరుతో అన్యాయంగా వ్యవహరిస్తే వారికి తగిన రక్షణ కల్పించేందుకు కొత్త నిబంధనల రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. ఐఏఎస్, ఇండిఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకు తగిన రక్షణ కల్పించే ఉద్దేశంతో ప్రస్తుత సర్వీస్ నిబంధనలను ప్రభుత్వం పునస్సమీక్షిస్తోందని  సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
 
 అయితే తమ పరిధిలో పనిచేసే సివిల్ సర్వీస్ అధికారులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్రాలకున్న అధికారంపై పరిశీలనేదీ చేయట్లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయా అధికారులను బదిలీ, సస్పెండ్ చేసే అధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయి. వారిని రాష్ట్రాల నుంచి తొలగించాలన్న డిమాండ్ ఇటీవల ఐఏఎస్ అధికారి దుర్గాశక్తిని సస్పెండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకోవడంతో మళ్లీ తెరపైకి వచ్చింది.

మరిన్ని వార్తలు