ఐఐటీ-జేఈఈకి ఫ్రీ కోచింగ్!

29 Jun, 2016 10:21 IST|Sakshi
ఐఐటీ-జేఈఈకి ఫ్రీ కోచింగ్!

కోయంబత్తూరు: ఐఐటీ-జేఈఈ ఆశావాహులకు శుభవార్త. ఐఐటీ-జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు కేంద్రప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఆన్ లైన్ కోచింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పరీక్షకు సంబంధించిన మెటీరియల్, పాఠ్యాంశాల వీడియోలను ఆన్ లైన్ ద్వారా ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి అందుబాటులో ఉంచనుంది. సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వెనుకబడిన వర్గాల విద్యార్థులకు కోర్సుకు సంబంధించిన వివరాలు, మెటీరియల్స్ తదితరాలు అందుబాటులో ఉంచాలనేది దీని ముఖ్య ఉద్దేశం.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తమిళనాడు ప్రభుత్వం అత్యంత చౌక ధరలకు ల్యాప్ టాప్, ఇంటర్ నెట్ సదుపాయాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికిది శుభపరిణామం. సీబీఎస్ఈ, ఐఐటీలకు చెందిన నిపుణులు, కేంద్రీయ విద్యాలయాలకు చెందిన టీచర్లు, కోచింగ్ ఇన్ స్టిట్యూట్స్ కు చెందిన నిపుణులతో కూడిన బృందం ఈ మెటీరియల్ ను తయారుచేయనుంది.

>
మరిన్ని వార్తలు