ఖాతాల హ్యాకింగ్‌పై వివరణ ఇవ్వండి

19 Jul, 2020 03:53 IST|Sakshi

ట్విట్టర్‌కు సీఈఆర్‌టీ–ఇన్‌ నోటీసు

న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్‌ వేదిక ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సైబర్‌ సెక్యూరిటీ నోడల్‌ ఏజెన్సీ ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ–ఇన్‌)  నోటీసు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని, వారి వ్యక్తిగత సమాచారాన్ని కొందరు వ్యక్తులు హ్యాక్‌ చేసినట్లు ఆరోపణలు రావడం తెల్సిందే. భారత్‌లో ఎవరెవరి ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయో చెప్పాలంటూ ట్విట్టర్‌కు సీఈఆర్‌టీ–ఇన్‌ నోటీసు ఇచ్చింది.

గుర్తు తెలియని వ్యక్తులు పంపిన మోసపూరిత ట్వీట్లు, లింక్‌లను దర్శించిన వారి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. హ్యాకింగ్‌ను అడ్డుకునేందుకు ఎలా చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంది. అంతర్జాతీయ స్థాయిలో రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ ప్రముఖులు, సినీ ప్రముఖుల ట్విట్టర్‌ ఖాతాలను దుండగులు హ్యాక్‌ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న జో బిడెన్, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్, టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తదితరుల ఖాతాలు హ్యాక్‌ అయ్యాయి. భారత్‌లోనూ పలువురు ప్రముఖుల ట్విట్టర్‌ ఖాతాల్లోకి దుండగులు ప్రవేశించారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో సీఈఆర్‌టీ–ఇన్‌ స్పందించింది.   
 

>
మరిన్ని వార్తలు