వారికి జూన్‌ 30 వరకు చాన్స్‌

1 Jan, 2017 08:36 IST|Sakshi
వారికి జూన్‌ 30 వరకు చాన్స్‌

ముంబై: ఎన్నారైలు రద్దయిన నోట్లను మార్చుకోవడానికి ఆర్‌బీఐ  2017 జూన్‌ 30వరకు గడువిచ్చింది. గత ఏడాది నవంబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 30 వరకు విదేశాల్లో ఉన్న ఎన్నారైలు ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. అలాగే ఈ కాలావధిలో విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులు(రెసిడెంట్‌ ఇండియన్‌ సిటిజన్స్‌) 2017 మార్చి 31 వరకు నోట్లను మార్చుకోవచ్చని ఆర్‌బీఐ  శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హులైన భారత పౌరులు ఎంత డబ్బు మార్చుకోవాలన్న దానిపై పరిమితి లేదని, ఎన్నారైలకు మాత్రం ఫెమా చట్ట నిబంధనల కింద(ఒక్కొక్కరు రూ. 25వేలు) పరిమితి ఉంటుందని పేర్కొంది.

గుర్తింపు పత్రాలు, పైన పేర్కొన్న కాలవ్యవధిలో విదేశాల్లో ఉన్నట్లు, ఇదివరకు నోట్లు మార్చుకోలేదని చూపేఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. మార్పిడిలో మూడో పక్షాన్ని(థర్డ్‌ పార్టీ) అనుమతించబోమని పేర్కొంది. ఈ నిబంధనలు పూర్తి చేస్తే బ్యాంకు ఖాతాలో మార్పిడి మొత్తం జమ అవుతుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు