నో వెయిటింగ్‌..కన్ఫర్మేషనేనా!

20 Nov, 2017 08:34 IST|Sakshi

న్యూఢిల్లీ: బుక్‌ చేసుకున్న రైల్వే టికెట్లు కన్ఫర్మ్‌ అయ్యే అవకాశాలు రెట్టింపయ్యాయని రైల్‌ యాత్రి అనే ఓ ట్రావెల్‌ వెబ్‌సైట్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2015 దీపావళి పండుగ రోజు 25.5 శాతం వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు రద్దు కాగా, ఇది 2016 నాటికి 18 శాతానికి తగ్గిపోయింది. ఈ ఏడాది దీపావళి నాటికి ఇదే పరిస్థితి కొనసాగిందని దీనిబట్టి చూస్తే వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు కన్ఫర్మ్‌ అయినట్లేనని పోర్టల్‌ తెలిపింది. డెహ్రడూన్‌–హౌరా  డూన్‌ ఎక్స్‌ప్రెస్‌కు  కన్ఫర్మేషన్‌ రేటు 20 శాతం మేర పెరిగింది. పుణె–జమ్మూ తావి జీలం ఎక్స్‌ప్రెస్‌ కు 12 శాతం, గయా మీదుగా వెళ్లే ముంబై సీఎస్టీ –హౌరా సూపర్‌ ఫాస్ట్‌ మెయిల్‌కు 11 శాతం కన్ఫర్మేషన్‌ రేటు పెరిగినట్లు వివరించింది. ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టడమే కారణమని తెలిపింది.

మరిన్ని వార్తలు