హస్తినకు బాబు, గవర్నర్ నరసింహన్

30 May, 2014 10:16 IST|Sakshi
హస్తినకు బాబు, గవర్నర్ నరసింహన్

న్యూఢిల్లీ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన ఈరోజు బిజీబిజీగా గడపనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.

*ఉదయం 10.30 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ
*11 గంటలకు జలవనరుల మంత్రి ఉమాభారతి
*మధ్యాహ్నం 12.30కు ప్రణాళిక మంత్రి జితేంద్రసింగ్‌
*మధ్యాహ్నం 2 గంటలకు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌
*మధ్యాహ్నం 3 గంటలకు ప్రణాళికాసంఘం సభ్యుడు వేణుగోపాల్‌రెడ్డి
*సాయంత్రం 4.30కు ప్రధాని నరేంద్ర మోడీ
*సాయంత్రం 6 గంటలకు విద్యుత్‌ మంత్రితో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజనవల్ల ఉత్పన్నమయ్యే సమస్యలతో పాటు, *నిధులపై ఆయన కేంద్రంతో పాటు, మోడీ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.

మరోవైపు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా హస్తిన వెళ్లారు. ఆయన ఈరోజు ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అవుతారు.

చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, గవర్నర్ నరసింహన్, హస్తినకు బాబు, chandrababu naidu, narendra modi, narasimhan, umabharathi

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా