పాక్‌ మారాలంటే ముందు భారత్‌ మారాలి

22 Apr, 2019 04:01 IST|Sakshi

కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం వ్యాఖ్య

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలంటే ముందుగా భారత్‌ పాక్‌పట్ల తన ప్రవర్తనను మార్చుకోవాలని కేంద్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం తెలిపారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో చిదంబరం మాట్లాడుతూ..‘మనం బలమైన సైన్యాన్ని తయారుచేసుకునేది యుద్ధం చేయడానికి కాదు. యుద్ధంరాకుండా నివారించడానికే. ఈ విషయం తెలుసుకున్నప్పుడు అని సమస్యలు పరిష్కారమైపోతాయి. ఇందుకోసం సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా సరికొత్తగా, విప్లవాత్మకంగా వ్యవహరించాలి’అని సూచించారు. భారత్‌–పాక్‌ల మధ్య సత్సంబంధాల కోసం ఇరుదేశాల పౌరులు విరివిగా రాకపోకలు సాగించేలా వీలు కల్పించాలని చిదంబరం అన్నారు. ఇరుదేశాల మధ్య సమస్యలకు యుద్ధం ఎన్నటికీ పరిష్కారం కాదన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు