రాజ్యసభలో గందరగోళం!

25 Nov, 2014 14:44 IST|Sakshi
శంషాబాద్ విమానాశ్రయం

న్యూఢిల్లీ: శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సభ్యులు వి.హనుమంతరావు, జేడీ శీలం, పాల్వాయి గోవర్ధన రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్ ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో సభను మొదట అయిదు నిమిషాలు వాయిదా వేశారు. సభ మళ్లీ మొదలైన తరువాత కూడా ఆందోళన కొనసాగింది.


ఈ నిరసనల మధ్యే బీమా బిల్లు సభలో చర్చకు వచ్చింది. బీమా బిల్లుపై నివేదిక సమర్పించడానికి సెలెక్ట్ కమిటీకి వచ్చే నెల  12వరకు గడువు పొడిగించారు. సభ సజావుగా జరగడానికి సహకరించాలని కోరినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను మళ్లీ వాయిదావేశారు.
**

>
మరిన్ని వార్తలు