తబ్లిగీ జామత్‌ కేసులో వారిపై చార్జిషీట్‌!

26 May, 2020 18:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తబ్లీగి జమాత్‌ కేసుకు సంబంధించి ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు మంగళవారం 82 మంది విదేశీయులపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. రాజధాని ప్రాంతంలోని నిజాముద్దీన్‌లో తబ్లీగి మసీదుకు వెళ్లి వచ్చిన వారి కారణంగానే భారతదేశంలో కరోనా కేసులు వేగంగా విస్తరించిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే పలు సాక్ష్యాధారాలతో ఢిల్లీలోని సాకేత్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. 15,449 పేజీలు ఉన్న ఈ చార్జ్‌షీట్‌ను జూన్‌ 12న పరిశీలించనున్నారు. ఈ చార్జ్‌షీట్‌లో 14 మంది ఫిజీ నుంచి వచ్చినవారు, 10 మంది సౌదీ అరేబియా, 8 మంది అల్జీరియా, ఏడుగురు బ్రెజిల్‌, చైనా, ఆరుగురు సూడాన్‌, ఫిలిఫైన్స్‌, అమెరికా నుంచి ఐదుగురు వేరే దేశాలకు చెందిన మరికొందరూ ఉన్నారు. దీనికి సంబంధించి మరో 14 చార్జీషీట్‌లను కూడా త్వరలో ఫైల్‌ చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారందరిపై ఫారినర్స్‌ యాక్ట్‌ 1946 సెక్షన్‌ 14(బి) కింద చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేసినట్లు తెలిపారు. వీరందరిపై  వీసా నిబంధనలు ఉల్లంఘించినందకు కేసులు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ​ (భారత్పై నేపాల్ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు)

కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న వేళ.. ఢిల్లీలోని  నిజాముద్దీన్‌లో మర్కజ్ భవనంలో తబ్లీగీ జమాత్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మత ప్రార్థనలు నిర్వహించారు. ఎక్కువ మంది మర్కజ్ భవనంలో గుమి గూడిన కారణంగా కరోనా వేగంగా వ్యాప్తి జరిగింది. దీంతో దేశంలో కనీసం 30 శాతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో వారిపై కేసులు పెట్టాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. (అత్యాచారం కేసులో చిలుక సాక్ష్యం)

మరిన్ని వార్తలు