పడవలు కాదు.. విమానాలు!

2 Dec, 2015 12:51 IST|Sakshi


చెన్నై: భారీ వర్షాల కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం చిన్నపాటి నదిలా మారిపోయింది. దాంతో విమానాలు కాస్తా పడవల్లా తేలుతున్నాయి. వరుసగా పార్కింగ్ చేసిన విమానాలు దూరంగా పడవల్లా కనిపిస్తుంటే కేవలం చెన్నై వాసులే కాదు.. భారతీయులంతా విస్తుపోతున్నారు. చెన్నై విమానాశ్రయం మొత్తం నీళ్లతో నిండిపోవడంతో విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. ఇక చెన్నై మీదుగా వెళ్లాల్సిన 19 రైళ్లు కూడా రద్దయ్యాయి.

నగరంలోని పలు ప్రాంతాల్లో పీకల్లోతు నీళ్లు ప్రవహిస్తుండటంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. అడయార్ నదిమీద ఉన్న వంతెన పై నుంచి నీళ్లు ప్రవహిస్తుండటంతో వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. నగరంలో ప్రజలు ఎటూ కదలడానికి వీల్లేకుండా పోయింది.


మరిన్ని వార్తలు