మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు ప్రమాణం

31 Aug, 2014 01:07 IST|Sakshi
మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు ప్రమాణం

హాజరైన సీఎం పృథ్వీరాజ్ చవాన్,
కేంద్ర మంత్రి గడ్కారీ తదితరులు

 
సాక్షి, ముంబై: మహారాష్ర్ట గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్‌రావు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం 4.10  గంటలకు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మోహిత్‌షా ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ర్ట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ దత్తాత్రేయ, మహారాష్ర్ట నాయకులు హర్షవర్ధన్‌పాటిల్, ఛగన్ భుజ్‌బల్, కిరిట్ సోమయ్య, సుధీర్ మునగంటివార్, నటి సైనా ఎన్సీ, చెన్నమనేని కుటుంబసభ్యులు హాజరయ్యారు. యూపీఏ హయాంలో మహారాష్ర్ట గవర్నర్‌గా నియమితులైన శంకర్‌నారాయణన్‌ను ఎన్డీఏ ప్రభుత్వం రాజీనామా చేయాలని కోరింది. అయితే అందుకు ఆయన నిరాకరించడంతో మిజోరమ్‌కు బదిలీ చేసింది. అక్కడకు వెళ్లేందుకు ఇష్టపడని శంకర్‌నారాయణన్ ఏకంగా గవర్నర్ పదవికే రాజీనామా చేసిన విషయం విదితమే.

>
మరిన్ని వార్తలు