రూ.3643 కోట్లతో భారీ శివాజీ విగ్రహం

24 Dec, 2018 11:26 IST|Sakshi

ముంబై : అరేబియా మహాసముద్రంలో ఏర్పాటు చేయనున్న మరాఠీ మహారాజు ఛత్రపతి శివాజీ మహా విగ్రహానికి(శివ్ స్మారక్) కావాల్సిన నిధులను మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విగ్రహ ఏర్పాటుకై రూ.3643.78 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత నెల 1న రాష్ట్ర కేబినెట్‌ సమావేశమై విగ్రహ ఏర్పాటుకు రూ.3700.84 కోట్లు కేటాయించింది. అయితే అధికారికంగా మాత్రం రూ. 56.70కోట్లు తగ్గించి రూ.3643.78కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ విగ్రహాన్ని 2022-2023 ఏడాదికల్లా పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని వార్తలు