ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా తొలి సంతకం నాదే: సీఎం

24 Jan, 2020 12:29 IST|Sakshi

న్యూఢిల్లీ: జర్మన్‌ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలను ఛత్తీస్‌ఘఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పోల్చారు. బీజేపీని ఏదైనా అనండి కానీ, భారత్‌ను విడగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం జైలుకు పంపుతామంటూ ఇటీవల అమిత్ షా హెచ్చరించిన విషయం తెలిసిందే. అమిత్ షా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఛత్తీస్‌ఘడ్ సీఎం.. హిట్లర్ సైతం తనను ఎవరేమన్నా పర్వాలేదని, జర్మనీని మాత్రం అనడానికి వీళ్లేదని తన ప్రసంగాల్లో చెప్పేవారని, 'మోటా భాయ్, ఛోటా భాయ్' సైతం అదే స్వరంతో, అదే భాషలో మాట్లాడుతున్నారని అన్నారు.

జాతీయ పౌర రిజిస్టర్‌ అమలు చేస్తామని ఒకరు లేదని మరొకరు.. ఇందులో ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తేల్చాలన్నారు. ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తే మాత్రం వ్యతిరేకంగా సంతకం చేసే మొదటి వ్యక్తిని తానే అవుతానని బఘేల్‌ పునరుద్ఘాటించారు. ఎన్‌ఆర్‌సీ అమలు చేయడం వల్ల భూముల్లేని నిరుపేదలు, నిరక్షరాస్యులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. (మోదీ-షా ఇద్దరిలో ఎవరు నిజం : బాఘేలా)

మరిన్ని వార్తలు