రాజద్రోహం కేసు ; ఆయనవల్లే బయటపడ్డా..!

15 Jun, 2019 14:56 IST|Sakshi

రాయ్‌పూర్‌ : ఇన్వర్టర్ల తయారీ సంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కైందంటూ ప్రభుత్వంపై విమర్శలకు దిగిన ఓ వ్యక్తిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేవిధంగా సోషల్‌ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేశాడంటూ రాజనంద్‌గాం జిల్లాకు చెందిన మంగీలాల్‌ అగర్వాల్‌పై రాజద్రోహం కేసు నమోదు చేశారు. అయితే, ఈఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మంగీలాల్‌పై పెట్టిన రాజద్రోహం కేసును ఉపసంహరించుకొన్న పోలీసులు శనివారం ఆయనను విడుదల చేశారు. తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవడంలో ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘేల్‌ పాత్ర ప్రధానమైందని మంగీలాల్‌ చెప్పుకొచ్చారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

(చదవండి : ప్రభుత్వంపై విమర్శలు; రాజద్రోహం కేసు, అరెస్టు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు