అసెంబ్లీ క్యాంటీన్‌లో వెజ్‌లో చికెన్‌ ముక్కలు

20 Jun, 2019 15:43 IST|Sakshi

ముంబై: సాక్షాత్తూ మహారాష్ట్ర అసెంబ్లీ క్యాంటీన్‌లో వేజ్‌టేరియన్‌ వంటకంలో చికెన్‌ ముక్కలు దర్శనమిచ్చాయి. దీనిపై శాసనసభ్యుల్లో కలకలం రేగింది. దీంతో ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్పందించారు. వేజ్‌లో చికెన్‌ ముక్కలు వచ్చిన ఘటనపై విచారణ జరుపుతామని ఆయన సభకు హామీ ఇచ్చారు. 

ఎన్సీపీ సభ్యుడు అజిత్‌ పవార్‌ ఈ ఘటనను సభ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు ఫడణవీస్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, అసెంబ్లీ క్యాంటీన్‌లో వంటలు చేసేటప్పుడు పరిశుభ్రత నిబంధనలను పాటిస్తున్నారా? శుచీశుభ్రతతో ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) మార్గదర్శకాల ప్రకారం వంటకాలు చేస్తున్నారా? అన్నది ప్రస్తుతం విచారిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని క్యాంటీన్‌ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు సీఎం తెలిపారు. గత బుధవారం ఓ ప్రభుత్వ ఉద్యోగి అసెంబ్లీ క్యాంటీన్‌లో ‘మట్కీ ఉసాల్‌’ అనే వేజటేరియన్‌ వంటకాన్ని ఆర్డర్‌ చేశారు. కానీ, ఆయన తింటున్నప్పుడు చికెన్‌ ముక్కలు దర్శనిమిచ్చాయి. దీంతో బిత్తరపోయిన సదరు ఉద్యోగి ఈ విషయాన్ని విధానసభ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌ అతిక్రమిస్తే రెండేళ్ల జైలు

‘తబ్లిగ్హ్‌’ తెచ్చిన ‘తక్లీవ్‌’ అంతా ఇంతా కాదు!

'తక్కువ నష్టంతో సంక్షోభం నుంచి గట్టెక్కాలి'

ప్రధాని మోదీపై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసల వర్షం

‘లాక్‌డౌన్‌ ఎత్తివేత’.. హిందీ రాకనే ఈ తప్పిదం

సినిమా

‘బాహుబలి’ని బ్రేక్‌ చేసిన మహేశ్‌ చిత్రం

ఆ బికినీ ఫొటోకు అంత ఎడిటింగ్ ఎందుకు?

చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నా: హీరోయిన్‌

వైర‌ల్ అవుతున్న క‌రోనా సాంగ్‌

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై

వారి పెళ్లి పెటాకులేనా?!