నోట్లరద్దు నిర్ణయం దారుణం

10 Feb, 2017 01:34 IST|Sakshi

రాజ్యసభలో ప్రభుత్వంపై చిదంబరం తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశపరిచిందని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ ఎంపీ చిదంబరం రాజ్యసభలో ధ్వజమెత్తారు. 2017–18 బడ్జెట్‌పై మాట్లాడుతూ.. మోదీ నోట్లరద్దు నిర్ణయం అత్యంత దారుణమైనదని అభివర్ణించారు. ఈ నిర్ణయం వల్ల అవినీతి, నల్లధనం తగ్గకపోగా దేశ ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపిందని మండిపడ్డారు.

‘తడబాటు, గందరగోళం, తలాతోకాలేని విధానం’తో ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ‘ఎన్ ఎస్‌ఎస్‌ఓ లెక్కల ప్రకారం దేశంలో 40 కోట్ల మంది రోజూవారీ కూలీలున్నారు. మీ నిర్ణయంతో వీరి జీవితాలు అగమ్యగోచరంగా మారాయి’ అని విమర్శించారు. అటు లోక్‌సభలో యూపీఏ ప్రభుత్వం తీసుకున్న విధానాల ద్వారా జరిగిన నష్టాలను  జైట్లీ ఎండగట్టారు.

మరిన్ని వార్తలు