చిదంబరంను ప్రశ్నించిన ఈడీ

5 Jun, 2018 20:05 IST|Sakshi
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో మాజీ కేంద్ర మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పీ. చిదంబరంను మంగళవారం ఈడీ ప్రవ్నించింది. కేసులో సంబంధిత పత్రాల ఆధారంగా చిదంబరంను ఈడీ అధికారులు దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. రూ 3,500 కోట్ల పైబడిన ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంలో ఆర్థిక మం‍త్రి పాత్రపై అప్పటి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్‌ఐపీబీ) అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ల ఆధారంగా కూడా ఈడీ చిదంబరంను ప్రశ్నించినట్టు సమాచారం.

ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు చేరుకున్న చిదంబరంను అప్పటికే ప్రశ్నలతో సిద్ధమైన అధికారులు పలు కోణాల్లో ఆయన నుంచి సమాధానాలు రాబట్టారు. ఇక మధ్యాహ్నం గంటపాటు భోజన విరామ సమయం ఇచ్చిన అధికారులు అనంతరం తిరిగి విచారణ చేపట్టారు. ఈ కేసులో మరోసారి చిదంబరంను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎఫ్‌ఐపీబీ ఆమోదానికి సంబంధించి దాదాపు 54 పైళ్లు ఈడీ పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు అక్రమంగా ఎఫ్‌ఐపీబీ ఆమోదం లభించినట్టు ఈడీ ఆరోపిస్తోంది.

>
మరిన్ని వార్తలు