మీ పని మీరు చూసుకోండి

29 Dec, 2019 06:18 IST|Sakshi

ఆర్మీ చీఫ్‌పై మండిపడిన చిదంబరం

తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు చేస్తున్న నిరసనలను ఉద్దేశించి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం మండిపడ్డారు. తిరువనంతపురంలో నిరసన ర్యాలీలో చిదంబరం మాట్లాడారు. ‘రాజకీయ నాయకులుగా మేమేం చేయాలో మాకు తెలుసు. ఆర్మీ చీఫ్‌గా మీ పని మీరు చూసుకోండి. యుద్ధంలో ఎలా పోరాడాలో మేం మీకు చెబుతున్నామా? మీ ఆలోచనల ప్రకారం మీరు యుద్ధం చేయండి. రాజకీయ నాయకులుగా మా పని మేం చేస్తాం’అని స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు