కేజ్రీవాల్‌కు ఢిల్లీ నిర్వచనం తెలుసా: చిదంబరం

8 Jun, 2020 17:53 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి​. ఇటీవల రాష్ట్రేతరులకు ఢిల్లీలో కరోనా చికిత్స అందించబోమని ప్రకటించిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం మండిపడ్డారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం ఢిల్లీ వాసులకే కరోనా చికిత్స చేస్తామని కేజ్రీవాల్‌ అంటున్నారు.. కానీ ఢిల్లీ వాసులంటే నిర్వచనం చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. రాష్ట్రేతరులకు అనుమతి లేదన్న  ప్రకటనపై ‌ న్యాయ నిపుణులను సంప్రదించారా అని ప్రశ్నించారు. (ఢిల్లీ ఆసుపత్రుల్లో 'ఇతరులకు' నో ఛాన్స్!)

కాగా దేశంలోని ప్రజలు జనవరి నెలలో కేంద్ర పథకం ఆయుష్మాన్‌ భారత్‌లో తమ పేరును నమోదు చేసుకుంటే.. దేశంలో ఎక్కడైన చికిత్స చేసుకునే వెసులుబాటు ఉంటుందని చిదంబరం గుర్తు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం పై  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ ఫైర్‌ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలకు హక్కులుంటాయని అన్నారు. కరోనా చికిత్సకు రాష్ట్రేతరులు అనుమతి లేదన్న ప్రకటనపై  ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు. చదవండి: వాళ్లంతా అమాయకులను ఎక్కడా చూడలేదు

మరిన్ని వార్తలు