సీఈసీగా అచల్‌

7 Jul, 2017 01:02 IST|Sakshi
సీఈసీగా అచల్‌

న్యూఢిల్లీ: 21వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా అచల్‌ కుమార్‌ జోతి గురువారం బాధ్యతలు స్వీకరిం చారు. ఎన్నికలను పారదర్శకంగా, విశ్వసనీయంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం తన కృషిని కొనసాగి స్తుందని ఆయన అన్నారు. ప్రతి ఓటరుతో ఓటు వేయించాలనే తమ ప్రాధాన్యాన్ని అను సరిస్తూనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఈ–పరిపాలనను ప్రోత్సహిస్తామని తెలిపారు.

అచల్‌ 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో గుజరాత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. అనంతరం 2015 మే 8న ఎన్నికల కమిషనర్‌గా నియమితుల య్యారు. ఇప్పటివరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన నసీం జైదీ బుధవారం పదవీ విరమణ చేయడంతో ఆ పదవిని అచల్‌ చేపట్టారు. వచ్చే ఏడాది జనవరి 17 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న అచల్‌ను సీఈసీగా నియమించడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది.
 

మరిన్ని వార్తలు