-

కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు!

7 May, 2016 19:08 IST|Sakshi
కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు!

న్యూఢిల్లీః ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు స్థానిక కోర్టు సమన్లు పంపింది. పది నెల్లక్రితం పోలీసులను ఉద్దేశించి ఆయన వాడిన అభ్యంతరకర పదాలపై ఇద్దరు పోలీసులు కోర్టుకు ఫిర్యాదు చేయడంతో విచారించిన కోర్టు కేజ్రీవాల్ కు సమన్లు పంపింది.

గతంలో ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ పోలీసులను  ''తుల్లా'' గా పిలవడంపై అభ్యంతరం తెలుపుతూ ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ళు కోర్టుకు  ఫిర్యాదు చేశారు. అప్పట్లో టెలివిజన్ ఇంటర్వ్యూ ప్రసారం అనంతరం పోలీసులను ఉద్దేశించి  కేజ్రీవాల్ వాడిన పదంపై నగరంలోని రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవ్వడంతోపాటు, కోర్టులో పరువునష్టం దావా కూడ వేశారు. ఈ కేసు నగరంలోని అనేకమంది సీనియర్ పోలీసు అధికారులను కూడ ఆకర్షించింది. ఇద్దరు ఢిల్లీ కానిస్టేబుళ్ళ  ఫిర్యాదు మేరకు గత జూలై 14న కేజ్రీవాల్ స్వయంగా కోర్టు హాజరు కావాల్సి వచ్చింది.

సీఎం కేజ్రీవాల్ వాడిన పదం ఒక్క పోలీసులను మాత్రమే కాదని, ఢిల్లీ పౌరుల పరువుకు కూడ భంగం కలిగించడమేనంటూ కానిస్టేబుళ్ళు కపూర్ సింగ్ ఛికారా, హర్వీందర్ సింగ్ లు తమ ఫిర్యాదులో తెలిపారు.  ఇప్పటికే కేజ్రీవాల్, ఆప్ సభ్యులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్నారు.  గత డిసెంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ కోవార్డ్, సైకోపాత్ అంటూ ట్వీట్ చేసి వివిధ వర్గాలనుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడ ఎదుర్కొన్నారు.

మరిన్ని వార్తలు