‘కశ్మీర్‌లో ఏ ఒక్క ప్రాణం పోలేదు’

16 Aug, 2019 16:32 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో ఆంక్షల కారణంగా ఏ ఒక్క ప్రాణం కూడా పోలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5వ తేదీ నుంచి అక్కడ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై సుబ్రహ్మణ్యం శుక్రవారం శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడారు. కశ్మీర్‌ లోయలో టెలిఫోన్‌ లైన్లు, ఇతర సమాచార వ్యవస్థపై ఉన్న ఆంక్షలను దశలవారీగా ఎత్తివేయనున్నట్టు వెల్లడించారు. శు​క్రవారం అర్ధరాత్రి నుంచే ఈ సేవలు కొంతమేర అందుబాటులోకి వస్తాయని చెప్పారు. నిషేధిత సంస్థలతోపాటు, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలతో ముప్పు పొంచి ఉన్నందున దశల వారీగా ఆంక్షలు సడలించాలనే నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొన్నారు.

బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం ప్రసంగంలోని అంశాలు..

  • టెలిఫోన్‌ సేవలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి నెమ్మదిగా అందుబాటులోకి వస్తాయి. సమాచార వ్యవస్థపై ఆంక్షలను దశలవారీగా ఎత్తివేస్తాం. బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను పూర్తి స్థాయిలో పునరుద్దరించడానికి మరికొంత సమయం పడుతుంది.
  • పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు నేటి(శుక్రవారం) నుంచి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి.
  • మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై రాజకీయ నిర్భంధాన్ని ఎత్తివేయడం జరిగింది. ఇలాంటి అంశాలను రోజువారీగా సమీక్షించాల్సిన అవసరం ఉంది.
  • శాంతి భద్రతలను కాపాడటం కోసం చట్టంలోని నిబంధనల ప్రకారం కొందరు వ్యక్తులను ముందస్తుగా నిర్భంధించడం కూడా జరిగింది 
  • ఆంక్షల కారణంగా ఏ ఒక్కరు కూడా మృతి చెందలేదు. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థలు ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఒక్క ప్రాణం కూడా పోకుండా చర్యలు చేపట్టాం. 
  • ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ ప్రజలకు కనీస అవసరాలైన ఆహారం, మెడిసిన్‌ సరఫరా చేశాం. శాటిలైట్‌ చానళ్లు, న్యూస్‌ పేపర్స్‌ను అందుబాటులో ఉంచాం. అలాగే వైద్య సేవలను కూడా అందించాం. 
  • మొత్తం 22 జిల్లాలు ఉండగా.. 12 జిల్లాలో సాధారణ పరిస్థితులునెలకొన్నాయి. మరో ఐదు జిల్లాలో కొద్ది పాటి అంక్షలు ఉన్నాయి. 
  • ప్రజా రవాణా అందుబాటులోకి రావాల్సి ఉంది.
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రవిశాస్త్రి ‘ట్రేసర్‌ బుల్లెట్‌’ వైరల్‌..!

ప్రధాని మోదీ మీటింగ్‌.. వీడియో లీక్‌!

మోదీకి కృతజ్ఞతలు తెలిపిన బ్రెజిల్‌ అధ్యక్షుడు

కరోనా: అక్కడ పూర్తిగా లాక్‌డౌన్‌!

కరోనా: మహిళా డాక్టర్లపై దాడి.. ఒకరి అరెస్ట్‌

సినిమా

ఎల్లకాలం నీకు తోడుగా ఉంటా: బిగ్‌బాస్‌ రన్నరప్‌

కరోనాతో హాలీవుడ్‌ నటుడు మృతి

ఫిజికల్‌ డిస్టెన్స్‌.. సెల్ఫీ

నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం?

కరోనా విరాళం

నిర్మాత కరీమ్‌కు కరోనా